దేవాలయంలో హుండీలో డబ్బులు వేస్తున్నారా?? మేల్కోండి .

0

ఇక పైన దేవాలయాల కి వెళ్ళి నప్పుడు:
1. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలలోని హుండీలలో డబ్బులు వేయకండి. ఆ వేసిన డబ్బుని దేవాదాయశాఖ VIP విజిటర్స్ మీద హాయిగా ఖర్చు పెడుతుంది. ఇది జగమెరిగిన సత్యం.
ఇష్టం ఉంటే పదో పరకో పూజారికి ఇవ్వండి.
ఖచ్చితంగా హుండీలో మాత్రం వేయకండి. ఇలా చేస్తే కొన్నేళ్ళకి దేవాదాయశాఖ ఆదాయం లేని దేవాలయాలను వదిలి పారిపోతుంది. మనకి పట్టిన దరిద్రం వదులుతుంది.
ప్రైవేట్ గా భక్తులకమిటీలు బాగా నడిపే వాటిలో కానుకలు వేయండి.
2.చక్కగా దేవీ దేవతలను దర్శనం చేసుకోండి. భక్తిని ప్రదర్శించండి.
కానీ కొబ్బరికాయలు కొనకండి.ఎందుకంటే గుడిలో వాటిని పూజారి కొట్టటం నైవేద్యం పెట్టటం ఉండవు. వాటిని ఎవరో కాంట్రాక్టర్ పెట్టిన మనిషి కొడతాడు + అమ్ముకుంటాడు.
3. పసుపు,కుంకుమ,అగరత్తులు, హారతి కర్పూరం మీరు తీసుకుని వెళ్తారు. వాళ్లు మళ్ళీ అవే మనకి అమ్ముతారు. ఇతర భక్తు రాళ్ళ పాదాలకు పసుపు రాయండి.అమ్మ వారికి పెడుతున్నాము అనుకుని వారికి భక్తితో గౌరవించి నమస్కారము చేయండి.
దేవాలయం ఆదాయంతో మీకు కనీసం ప్రసాదం కూడా పెట్టరు.
4. చీరేలు ,రెవికల గుడ్డలు అమ్మవారికి మొక్కు తీర్చుకోండి, కానీ వాటిని మరల మీరు తీసుకోండి లేదా వాటి అవసరం ఉన్న వాళ్ళకి దానంగా ఇవ్వండి.
అమ్మవారు సంతోషించి మిమ్ములను ఆశీర్వాది స్తుంది
వేలమువేసి అమ్ముకుని డబ్బు చేసుకునే పాపంలో పాలు పంచు కోకండి !!
5. అన్నదానం ఉన్న చోట అన్నదానానికి డబ్బు కట్టండి.ఏదో కొంతలో కొంత నయం పుణ్యం వస్తుంది.
లేదంటే మీ ఇంటిలో నైవేద్యం తయారు చేసుకుని వెళ్ళండి.దేవి దేవతలకి భక్తితో వాటిని వారికి చూపించండి.వాటిని చక్కగా మీరే భక్తులకి పంచిపెట్టండి.అలాగే ఆకలితో అలమటిన్చే అన్నార్తులు దేవాలయం బయట ఉంటారు వారి కడుపు ఆకలి తీర్చేప్రయత్నం చేయండి.
6. ఇంకా దానం చేయాలి అని అనిపిస్తే గోశాలలలోని గోవులకి ఆహారం కొని తీసుకుని వెళ్ళి ఇవండీ.మీ వంశము తరిస్తున్ది.మీ పెద్దలు ఆశీర్వాదిస్తారు.
7. శ్రీ రామ నవమి,వినాయక చవితి పందిళ్లు వేసేమంచి వారికి చందాలు కొద్దిగా ఇవ్వండి. నైవేద్యాలు ఇళ్ళలో చేసి ఇవ్వండి లేదా పళ్ళు ఫలహారాలు పంచి పెట్టండి లేదా అన్నదానాలు చేయండి. ఏవైనా మీరు ప్రత్యక్షంగా చూసి,పాల్గొనండి.చివరి పలుకు:
ఆదాయం వచ్చే చిన్న చిన్న ఆలయాలు, పెద్ద పెద్ద దేవాలయ కమిటీలు అన్నీ ఆయా రాజకీయ పార్టీల వాళ్ళతో, వాళ్ళకిష్టమైన వాళ్ళతో నింపుతున్నారు.
మసీదులకి,చర్చిలకి కమిటీలు ప్రభుత్వం ఇలా నియమిస్తారా ? చస్తే చేయరు. అందుకని ఈ దొంగ సెక్యులర్ ప్రభుత్వం వారు నిర్వహించే దేవాలయాల లో డబ్బులు వేయవద్దు.
ముల్లాలకి ,మౌల్వీలకి ముత్తావలీలకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. మక్కా హజ్ యాత్రలకి ,క్రైస్తవులకి జెరూసలెమ్ యాత్రలకి,మసీదులు ,చర్చిలు కట్టుకోవటానికి ప్రభుత్వం మనం కట్టే పన్ను డబ్బుతోకట్టిస్తారు, యాత్రలకు పంపుతారు .మనకి మానస సరోవర్ యాత్రకి మనల్ని పంపుతారా ? పంపరు.
మన డబ్బు, మన దేవాలయం , మన దేవుడు,మన పెత్తనం,మన భక్తి ,మన ఆనందం .మన దేవాలయ ఆస్తులు మనం కాపాడు కోవాలి. మన పీఠాధిపతులు, మన మఠాధి పతులు, ఆచార్యులు ,మన భక్తులు నడిపేదాకా మనం ప్రభుత్వా ధీన దేవాలయాలలో డబ్బులు వేయకుండా వాటికి స్వతంత్రం వచ్చేదాకా దీనిని పాటిద్దామని ప్రతిజ్ఞ చేద్దాము.
జైహింద్


Leave A Reply