MESSAGE TO MY FATHER

0

మా నాన్నకి పంపిన message

Happy Father’s day పిచ్చి నాన్నా..

“ఎందుకు నువ్వు పిచ్చి అంటే..
చాలా మంది, పిల్లల్ని కని రోడ్డు పక్కన వదిలేసి పోతున్న ఈ కాలంలో కూడా.. నువ్వు మాత్రం..

పొద్దున్నే 5 గం లేచి.. పాలు తీసుకుని వచ్చి… రాత్రి 9 గం.. పడుకునే వరకూ… మా కోసం ఇన్ని చేస్తావు కదా.. నువ్వు పిచ్చి నాన్నవే!!


అంతే కాదు

పండుగరోజు ఎప్పుడైనా, ఎలా జరిగింది పండుగ అంటే.. ఏం పండుగ లేరా అంటావ్..

మరి మేము ఊరికి వస్తే మాత్రం… కొత్త బట్టలు తెప్పించి, పండుగలా సంతోషిస్తావ్ కదా అందుకే నువ్వు పిచ్చి నాన్నవి !!

అది సరే కానీ ..

ఊరికి వస్తే, బయట వాళ్లు కూడా.. ఏం చేస్తున్నావ్, ఎంత సంపాదిస్తున్నావ్ అని అడుగుతారే..

కానీ నీకు అలా అడగాలని అనిపించదా నాన్నా…
ఎప్పుడూ మాట్లాడినా ..

time కి తింటున్నావా…
ఎండలో బయటకు వెళ్లకు….
వర్షంలో తడవద్దు…
Road మీద జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళు…. అని చెప్తావే ..

నువ్వు మాత్రం పిచ్చోడి లాగ..

ఎండలో..
వానలో..
కష్టం బయటకు కనబడకుండా
హాయిగా… మాకోసం తిరిగి 3 సార్లు బండిలో నుంచీ పడిపోయావే… అందుకే నువ్వు పిచ్చి నాన్నవి…


ఏం నీది ప్రాణం కాదా..
లేదా, మా కోసం యంత్రం లా కష్టపడి.. యంత్రం అని feel అవుతున్నావేమో..

కొంచెం నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు..

నీకు ఏమైనా అయితే మేం తట్టుకోలేం..”

నీ లాంటి నాన్న కోసం ఏం.. చేసినా అది తక్కువే..!
Love u నాన్నా !!”


ఇంకో విషయం..
అందరు దేవుడు అంటే, గుడిలో ఉండే ఆ విగ్రహాన్ని చూపిస్తారేమో.. నాకు మాత్రం మా ఇంట్లో ఉండే మా నాన్నే దేవుడు..!!
Happy Father’s day !!

Comments are closed.