ఓ కళాకారుడి చివరి మాట.

0

క్యాన్సర్ తో బాధ పడుతున్నఓ సినిమా కళాకారుణ్ణి చూసి వైద్యం చేసే 

ఓ డాక్టర్ ఇలా అడిగాడట …

” ఎందుకు సర్ … 

ఈ పిచ్చి జనాలు రంగులూ , సినిమాలంటూ వెంట పడుతుంటారు 

ఏం ఉంటుంది సర్… సక్సెస్ వచ్చేదాకా , డబ్బులు లేక , టైం కి తినక చస్తారు 

డబ్బు సంపాదించే టైం కి , నానా రకాలా రోగాలతో చస్తారు . 

ఫైనల్ గా ఎంత కష్టపడి సంపాదించినా ఏం లాభం సర్ ??

ఎక్జాంపుల్ మిమ్మల్నే తీస్కోండి , ఈరోజు మీ దగ్గర లక్షలున్నాయి .. 

కాని ఏం లాభం – అనుభవించడానికి జీవితం ఉండాలి కదా !! 

ఎనభై లో పోవాల్సిన మీరు యాభై కూడా దాటాకముందే పోతుంటే బాధగా ఉంది సర్ ” అంటూ జాలి చూపించాడట
ఆ మాట విన్న కళాకారుడు …

” మీ సానుభూతి కి థాంక్స్ సర్ .. 

మీరు చెప్పింది నిజమే … 

సంపాదించింది అనుభవించే యోగ్యం అందరికీ ఉండదని తెల్సినా , వెర్రిగా , పిచ్చిగా ఎందుకు కష్టపడపడతారో తెల్సా ?

” నలభై ఏళ్ళు ఈ భూమ్మీద బ్రతికినా – ఇంకో నలభై ఏళ్ళు కొన్ని లక్షల మంది గుండెల్లో బ్రతికుండాలనే స్వార్ధం తొ సర్ … గొప్ప జీవితం అంటే మా దృష్టిలో ఎక్కువ కాలం బ్రతకడం కాదు , ఎక్కువ మంది జనాల్లో బ్రతికి ఉండటం ” అంటూ గర్వంగా చెప్తూ వెళ్ళిపోయాడట  🙂 🙂

ఆ మాటలు విన్న డాక్టర్ తర్వాత తన చాంబర్ లో ఆ కళాకారుని కట్ అవుట్ పెట్టుకుని అందులో కొన్ని లైన్స్ ఇలా రాసుకున్నాడట ”

” There is a death for every Person but not for their service “


Leave A Reply