అమ్మ నాన్నల విలువ…

0

తల్లి కడుపున పుట్టిన ప్రతి వారు చదవాల్సిందే…!!!
సుధాకర్ ఆఫీసులో UDC గా పని చేస్తున్నాడు,మనిషి మంచివాడే కానీ పూర్తిగా భార్యా విధేయుడని మిగతా స్టాఫంతా చెవులు కోరుక్కుంటుటారు,
సుధాకర్ ఆరోజు ఎందుకో చాలా చిరాకుగా ఉన్నాడు
ఆఫీసు ప్యూన్ వచ్చి మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు వెళ్ళమని చెప్పేసరికి ఆ చిరాకు ఇంకా నషాళానికంటింది,
ఆ(..ఏంటట ?వెళ్తాలే అన్నాడు మరింత చిరాకుగా..ఈయన గారి వాలకం చూసిన ప్యూను నాకెందుకులే అని వెళ్ళిపోయాడు,
వెళ్ళకపోతే బావుండదు,
పైగా బాస్,
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం,
పైకి ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు కానీ ఆ కళ్ళే చెపుతాయి ఆయన పట్టుదలను, అందుకే ఆయన కళ్ళు చూస్తే అబద్దం చెప్పలేం బాబోయ్ అంటుంటారు స్టాఫంతా.
అలాగని చెడ్డవాడూ కాదు,
మెున్న ప్యూను కూతురుకి మంచి మార్కులు వస్తే పై చదువులకు డబ్బు లేకపోతే తనే స్వయంగా వెళ్ళి ఆ అమ్మాయిని కాలేజి లో చేర్పించాడు,స్టాఫ్ లో అందరూ ఓకరికి తెలియకుండా ఓకరు ఆయన సాయం పోందిన వారే..
అందుకే ఆయనంటే భయంతో కూడిన అభిమానం అందరికీ..
ఎట్టకేల కి బాస్ రూం లోకి అడుగుపెట్టి విష్ చేసాడు సుధాకర్..
బాస్ సుధాకర్ వైపు చూడకుండానే ఫైలు చూసుకుంటూ
ఏమయ్యా సుధాకర్? ఏంటి ఇవాళ చిరాగ్గా ఉన్నావ్,ఎనీ ప్రాబ్లెం ?అన్నాడు
సుధాకర్ కు చిరాకంతా ఎగిరిపోయింది,చిరాకు స్ధానం లో కన్ఫ్యూషన్ చోటు చేసుకుంది,నేను చిరాగ్గా ఉన్నట్టు మీరెలా కనుక్కున్నారు సర్ ?అని మనసులో మాట బయటకు అనేసి నాలుక్కరచుకున్నాడు..
బాస్ నవ్వుతూ..నీవు ఎప్పుడూ అంత విసురుగా నా కేబిన్ డోరు తీయలేదు అందుకే అడిగాను ఎనీ ప్రాబ్లం ?
అవును సర్..మా అమ్మ నే ప్రాబ్లం సర్ !
మీ అమ్మ ప్రాబ్లమా ? ఆశ్చర్యపోయాడు బాస్.
ఇఫ్ యు డోంట్ మైన్,
నీ పర్సనల్ విషయం లో తల దూర్చరాదు,
కానీ మీ అమ్మ ఎలా ప్రాబ్లమో చెప్పగలవా? ముందు కూర్చో…అన్నారు
కూర్చోగానే ధైర్యం వచ్చేసింది సుధాకర్ కు,ఇక చెప్పసాగాడు తన తల్లి గురించి,
చాలా ప్రాబ్లం గా ఉంది సర్ మా అమ్మతో
రాత్రుల్లు దగ్గుతూ నిద్ర లేకుండా చేస్తుంది, మేం చేసిన వంట ఆమెకు రుచించదు, బాత్రూం అంతా గలీజు చేస్తుంది, ఓక్కోసారి బట్టల్లోనే ఓంటికి, రెంటికి కూడా చేసుకుంటుంది సర్, భరించలేకున్నాం సర్ కంపుతో, నాభార్య తో మా అమ్మ గురించి రోజూ గోడవనే సర్, చివరకు నా భార్య పోరు పడలేక మూడురోజుల క్రితం వ్రుధ్ధాశ్రమం లో వదిలేసి వచ్చా సర్, వదిలేసి వచ్చినప్పటినుండి ఈరోజు వరకు భోజనం చేయటం లేదట, వ్రుధ్ధాశ్రమం వారు గంట, గంటకు ఫోన్ చేసి మీ అమ్మను తీసికెళ్ళమని ఫోన్ లతో చంపేస్తున్నారు సర్, ఏదో ఇంత ముద్ద తిని చావచ్చు గదా, మా ప్రాణాలు తీయకుంటే..అందుకే ఈ చిరాకు సర్.. క్షమించండి సర్. అన్నాడు
అంతా విన్న బాస్ గట్టిగా నిట్టూర్పు వదలి నిజమే సుధాకర్, ఈ తల్లిదండ్రులు కడదాక మనతోనే ఉండాలనుకుంటారు, కానీ ఇది వారనుకున్నట్టు సత్తెకాలం కాదు కదా, పరిస్థితి బట్టి వారూ మారాలి, ఎనీ హౌ చాలా సఫర్ అవుతున్నావు సుధాకర్, ఈ చిరాకు పని మీద చూపించకు.. ఓకే..
అబ్బే లేదు సర్…
సరే, నీకు పర్శనల్ గా చెపుతున్నాను, నీమీద నమ్మకంతో.. ఈ రెడ్ కలర్ ఫైలు చాలా కాన్ఫిడెన్షియల్.. నాకు ఆఫీసులో నమ్మకం లేదు, అందుకే నీ దగ్గర ఉంచుతున్నాను, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు చూపాలి, ఆఫీసులో ఎట్టి పరిస్థితి లో పెట్టరాదు, ఎప్పుడూ నీ వెంటే ఉంచుకోవాలి, ఈ పని నీవు చెయ్యగలవా?
నామీద మీరంత నమ్మకం పట్టుకున్నాక ఈ పని నేను చెయ్యలేక పోవడం ఏంటి సర్? చేస్తాను, అని ఫైలు తీసుకుని బయట పడ్డాడు,
ఆరోజు నుండి మెుదలైంది తలనోప్పి సుధాకర్ కు, బాస్ చీటికి, మాటికి ఆఖరుకు రాత్రిపూట కూడా ఫోన్ చేసి మరీ ఫైలు చెక్ చేసుకునే వాడు, తిరగలేక ,మెుయ్యలేక చివరకు ఫైలు చూస్తేనే దడ పుడుతుంది సుధాకర్ కు,
ఓరోజు బాస్ సుధాకర్ తో మనిద్దరం బెంగుళూరు కు వెళుతున్నాం, ఫైలు తో రెడీగా ఉండు, నీ లగేజ్ సర్జుకుని రమ్మన్నాడు, ఇంతమంది స్టాఫ్ లో నన్నోకరినే తీసుకెళుతుంటే లోలోపల గర్వంగా కూడా ఫీలయ్యాడు, అప్పటికే సుధాకర్ బాస్ కు దగ్గరయ్యాడని స్టాఫ్ లో క్రేజ్ కూడా పెరిగింది, ఇద్దరూ రైలులో ప్రయాణం చేస్తున్నారు, TC గారు టికెట్ చెకింగ్ కు వచ్చారు,బాస్ సుధాకర్ టికెట్స్ చూపించమన్నారు,సుధాకర్ అవాక్కయ్యాడు,నా దగ్గర టికెట్స్ లేవు,మీరెప్పుడిచ్చారు ?
బాస్ కు చిర్రెత్తుకోచ్చింది,
యూ ఫూల్ ! టికెట్స్ బుక్ చేయమని కూడా నేను నీకు చెప్పాలా ?నీకు తెలియదా ?అనేసరికి గడ,గడ వణికిపోయాడు సుధాకర్..ఇప్పుడెలా ?
సర్,మీరెలాగో అడ్జస్ట్ అవండి,నేను టాయ్ లెట్ లో దూరిపోతాను అని బాస్ సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా టాయ్ లెట్ లో దూరిపోయాడు,రాత్రంతా టాయ్ లెట్ కంపుతో వాంతులయ్యాయి,తలపట్టేసింది,
మెుత్తానికి బెంగుళూరు చేరారు,
సారీ ,సుధాకర్..నీకు నేను చెప్పాల్సింది,TC ఓక్కరికి అడ్జస్ట్ చేసాడు నా పాత పరిచయం వల్ల..అయాం సారీ..
బాస్ అంతటవాడు సారీ చెప్పే సరికి మనవాడికి ఛాతీ ఉప్పోంగి ..సర్ విత్ ప్లెజర్ సర్ అన్నాడు..
బెంగుళూర్ లో తనఇంటికి తీసుకెళ్ళాడు సుధాకర్ ను,
బాస్ ఇల్లు ఇంద్ర భవనం లా ఉంది
ముఖ్యం గా బాస్ తల్లిగారు రాజమాత ఉన్నారు …బెడ్ మీద
బాస్ ఇంట్లోకి వెళ్తూనే సరాసరి తన తల్లి ఉన్న గది కి వెళ్ళి ఆమె పాదాలు స్ప్రుశించాడు.. ఆమె కళ్ళు తెరచి కోడుకుని చూసి ఏరా? ఇదేనా రావడం? భోంచేసావా?
ఇంకా లేదమ్మా,
ముందు స్నానం చేసి భోం చెయ్,
అలాగే నమ్మా..
పనివాడి కన్నా హీనం గా ఆమె ముందు నిలబడ్డ తన బాస్ ను చూసి ఈయన మా బాసేనా? అన్న అనుమానం వచ్చింది సుధాకర్ కు, అన్నింటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే స్వయానా బాస్ భార్యనే దగ్గరుండి అత్తగారికి సపర్యలు చేయడం,
సుధాకర్ లో ఇవన్నీ చూసిన వెంటనే తనలో అంతర్మధనం మెుదలైంది,
తనకు, తన బాస్ కు ఎంత తేడా?
అంత హోదాలో ఉన్నా కూడా ఇసుమంతైనా విసుగు లేకపోవడం ఎలా సాధ్యం?
ఈ ఆలోచన లతో రాత్రి నిద్ర రాలేదు, తన తల్లి రూపమే కళ్ళముందు కనబడుతుంది,
తెల్లారింది.. రాత్రంతా నిద్ర లేక సుధాకర్ కళ్ళు ఎర్రబడ్డాయి..
బాస్ సుధాకర్ ను పిలిచి ఏమోయ్ సుధాకర్ క్రోత్త చోటు నిద్ర వచ్చినట్టుగా లేదు కదా,
అవును సర్,
సరే, స్నానము చేసి టిఫిన్ చేయ్, ముందు ఆ ఫైలు తీసుకురా,
ఫైలు అనగానే సుధాకర్ కు చిర్రెత్తు కోచ్చింది, ఏమైనా కానిమ్మని సర్, ఇక ఆ ఫైలు నేను మోయలేను, నన్నోదియ్యండి ప్లీజ్.. అన్నాడు
ఏం? అంత బరువు గా ఉందా ఆఫైల్?
ఫైలు బరువు కాదు దాన్ని మెయింటనెన్స్ చేయడమే బరువైంది సర్..
బాస్ కొద్ది నిముషాలు మౌనం గా ఉన్నాడు, నేను తోందరపడ్డానా? అనే అపరాధభావం సుధాకర్ మెుహం లో కోట్టోచ్చినట్టుగా కనబడుతుంది.
తరువాత బాస్ మెల్లగా లేచి సుధాకర్ భుజం పై చేయి వేసి
వంద గ్రాముల బరువు కూడా చెయ్యని ఫైలు ను నీవు కనీసం మూడురోజులు మెుయ్యలేక పోయావే, మరి నిన్ను మీ అమ్మ తన కడుపులో తోమ్మిది నెలలు ఎలా మోసిందంటావ్?
ఊహించని ప్రశ్న కు సుధాకర్ కు దిమ్మ తిరిగిపోయింది..
సర్.. అంటూ నీళ్ళు నమిలాడు
ఎవరెవరో వాడిన టాయ్ లెట్ ను రాత్రంతా భరించావు,
మరి నీ కన్నతల్లి వాసనని భరించలేక పోయావా?
సుధాకర్ కళ్ళు నీళ్ళ సుడులయ్యాయి, ఆమె తిన్న ఆహారం తోనే నీవు ఆమె కడుపులో తోమ్మిది నెలలు బ్రతికావు, అప్పుడు రాలేదా వాసన?
నిన్ను కనడానికి ఆమె ఎంత నోప్పి ని భరించిందో నీవు ఊహించగలవా?
నీ పుట్టుక తో ఆమె కళాకాంతులు కోల్పోయిన సంగతైనవనీకు తెలుసా?
భూమి మీద పడ్డాక నీ ముడ్డి నీవే కడుక్కున్నావా?
ఎన్ని సంవత్సరాలు ఆమె నీకు ఊడిగం చేసిందో చెప్పగలవా?
నాన్న తన్నుల నుండి నిన్ను ఎన్ని సార్లు కాపాడిందో గుర్తుకు తెచ్చుకో సుధాకర్? స్రుష్టి లో మనకు బలమైన మద్దతుదారు అంటే ఆ ఓక్కరు అమ్మనే ..
నీ కడుపు నింపడానికి ఆమె ఎన్ని సార్లు కడుపు కాల్చుకుందో నీకు తెలుసా? కనీసం ఆ కోణం లో ఆలోచించావా?
నీవు ఆమెను వ్రుధ్ధాశ్రమం లో వదిలినట్టుగా
ఆరోజుల్లో ఆమె కూడా నిన్ను అనాథ శరణాలయం లో వదిల లింటే నీ గతి ఏమయ్యేది ?
సుధాకర్ కు నోట మాట రావడం లేదు,
కళ్ళలో నీరు ధారాపాతంగా తనకు తెలియకుండానే కారిపోతున్నాయి,
అమాంతంగా తన బాస్ కాళ్ళ మీద పడ్డాడు,తన కళ్ళనీరు బాస్ పాదాలను తడిపేస్తున్నాయి..
నన్ను క్షమించండి సర్, నేను ఎంత పెద్ద తప్పు చేసానో తెలిసి వచ్చింది ,బుద్ధి వచ్చింది..
బాస్ నవ్వుతూ సుధాకర్ ను లేపి నీకు తెలిసిరావాలనే ఇదంతాచేసాను అంటూ ఆ ఎర్రఫైలు తెరిచి చూపాడు, అందులో నాలుగు తెల్ల కాగితాలు తప్ప మరేమీ లేవు,
సుధాకర్ వెంటనే బాస్ తల్లి పాదాలకు నమస్కరించాడు
బాస్ తో సర్ నాకు సెలవు కావాలి సర్!
దేనికి?
“మా అమ్మను వ్రుధ్ధాశ్రమం నుండి నా ఇంటికి తెచ్చుకోడానికి ”
.
.
.
.
మాత్రుదేవోభవ

అమ్మ ని నాన్న ని….
భారం….. అనుకోవద్దు….
వారు…
మన బంధం…
మన బాధ్యత..
మన ప్రాణం…

(Source Facebook)

Comments are closed.